గాడ్ ఫాథర్: ఇలా అయితే మరో ఆచార్యనే?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్‌ ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతుందా? ఇక ఆయన నెక్స్ట్‌ సినిమా ముందు సినిమా పరాభవాన్ని మరిపిస్తుందా? మెగాస్టార్ చిరంజీవిని నెవర్‌ బిఫోర్‌గా మోహన్‌ రాజా చూపిస్తారా?ఇక అసలు చిరంజీవి బౌన్స్‌ బ్యాక్‌ అవుతారా?… ఇదీ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పెద్ద చర్చ. అయితే దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం 'ఆచార్య' దారుణమైన పరాజయం ఇంకా రెండోది నెక్స్ట్‌ సినిమా 'గాడ్‌ ఫాదర్‌'కి ఇప్పటివరకు అనుకున్నంత హైప్‌ రాకపోవడం.'గాడ్‌ ఫాదర్‌' సినిమాకి సంబంధించి చిత్రబృందం ఇప్పటివరకు ఓ వీడియో ఇంకా కొన్ని ఫొటోలను రిలీజ్‌ చేసింది. ఇక అవన్నీ బాగున్నాయి తప్ప.. మరీ అద్భుతంగా లేవు అనేది కొంతమంది ఫ్యాన్స్‌ మాట. ఆ మధ్య విడుదల చేసిన ప్రీ టీజర్‌లో కూడా చిరంజీవి అలా కారు నుండి దిగి నడుచుకుంటూ వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకా షాట్స్‌ గతంలో చాలానే చూశాం. ప్రశాంత్‌ నీల్‌ ఇంకా సుకుమార్‌ చూపించిన ఎలివేషన్ల దగ్గర ఆ సీన్స్‌ ఏమాత్రం కిక్‌ ఇవ్వలేదు.పోనీ కనీసం పోస్టర్లలో అయినా ఏమన్నా కొత్తదనం చూపిస్తారా అంటే అందులోనూ పాత స్టైల్‌ లుక్‌లు కనిపిస్తున్నాయి.



ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి మేకోవర్‌ చేశారు అని అంటున్నారు కానీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ తప్ప ఇంకేం కనిపించడం లేదు. అయితే సినిమాల్లో ఏమన్నా ఆ స్థాయి ఫీల్‌ అయినా అందిస్తారా? అనేది చూడాలి. కనీసం ట్రైలర్‌ వీడియోలతో అయినా ఇది మూస చిరంజీవి సినిమా కాదు అనే ఫీలింగ్‌ ని కలిగించాలి.ఎందుకంటే 'ఆచార్య' సినిమాతో చిరంజీవి ఫ్యాన్స్ బాగా డౌన్‌ అయిపోయారు. సినిమాలో విజిల్‌ కొట్టే సీన్లు గట్టిగా అసలు రెండు కూడా లేవు. ఇప్పుడు 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో ఆ లోటు తీరకపోతే మళ్లీ ఇబ్బంది వస్తుంది. 'లూసిఫర్‌' సినిమాలో అయితే ఇలాంటి ఆప్షన్లు చాలానే ఉన్నాయి. మరి మోహన్ రాజా ఏ మేరకు వాటిని మెగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా మలిచి అందిస్తారో అనేది చూడాలి. విజయదశమి పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేస్తాం అని చెబుతున్నారు. ప్రచారంలో కూడా పెద్దగా కొత్తదనం కనిపించడం లేదు. కాబట్టి మూస అనే ఫీలింగ్‌ను ఖచ్చితంగా గట్టిగా పోగొట్టాలి 'గాడ్‌ ఫాదర్‌' టీమ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: