కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్.. చివరికి అలా?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చేసినవి కొన్ని సినిమాలు అయినా ప్రేక్షకులలో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. అంతే కాదు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వరుస అవకాశాలు అందుకుంటూ వుంటారు. అయితే ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి విజయం దక్కింది అంటే ఆ హీరోయిన్ కు వరుస అవకాశాలు రావడం ఖాయం. కానీ కొంతమందికి మాత్రం ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాక హిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఇండస్ట్రీలో కనుమరుగు అవుతూ ఉంటారు.

 ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హిట్ ఇచ్చిన ఒక హీరోయిన్ కూడా ఇలాగే ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది అని చెప్పాలి. ప్రస్తుతం తాతకు తగ్గ మనవడిగా కళ్యాణ్రామ్ కొనసాగుతున్నారు. ఒకవైపు హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకులకు లైఫ్ కూడా ఇస్తున్నారు. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమా వచ్చింది. ఇక అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సింధుతులాని నటించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

 ఇక ఈ సినిమా కథ డైరెక్టర్ టేకింగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టాడు. అదే సమయంలో సింధుతులాని  అభినయం కూడా ఈ సినిమాకి ఎంతగానో ప్లస్ అయింది అని చెప్పాలి. దీంతో ఇక ఆమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం అని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు తమిళంలో శింబు హీరోగా వచ్చిన మన్మధ సినిమాలో నటించింది. అది కూడా సూపర్ హిట్.  కానీ అక్కడ అవకాశాలు రాలేదు. అయితే ఇలా సింధుతులానీ అవకాశాలు లేక హీరోయిన్గా కనుమరుగు కావడానికి కారణం పెద్ద హీరోలకు సరిపడా  హైట్ పర్సనాలిటీ లుక్ లేక  పోవడం అనేది తెలుస్తుంది. ఇలా హీరోయిన్ గా కొనసాగడానికి టాలెంట్ ఉంటే సరిపోదు ఎక్స్ ట్రా క్వాలిటీస్ కూడా ఉండాలి అన్నది ఈ హీరోయిన్  విషయంలో నిజమైందని కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: