హీరోలకిచ్చే మర్యాద హీరోయిన్స్ కి ఇవ్వరు.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
టాలీవుడ్ సినీ పరిశ్రమలలో సాధారణంగా  హీరోలకి, హీరోయిన్స్ కి, అలాగే మిగిలిన ఆర్టిస్టుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు.ఇక  ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారికి సౌకర్యాలు, మర్యాదలు ఉంటాయి.అయితే ఇది అందరికి తెలిసిన విషయమే. కొంతమంది దీనిపై బహిరంగంగానే మాట్లాడతారు.ఇదిలావుంటే  ఇటీవల కొంతమంది హీరోయిన్స్ హీరోలని ఒకలా, మమ్మల్ని ఒకలా చూస్తారు అని అన్నారు. ఇకపోతే తాజాగా ఆ లిస్ట్ లోకి తమన్నా చేరింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది.
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..

 ”సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు. వీటి గురించి లేడి ఆర్టిస్టులు సీరియస్‌గా తీసుకోవడం లేదు.అంతేకాదు  నేను పనిచేసిన సినిమాల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే, సజెషన్స్ ఇస్తే టెక్నీషియన్స్ వాటిని పట్టించుకునేవారు కాదు. అయితే మహిళలకు సినిమా రంగంలో సరైన మర్యాద లేదు. కాగా ఎక్కువగా హీరోయిన్స్ అంటే హీరోలని ప్రేమించే పాత్రలకే తీసుకుంటారు. ఇకపోతే ఒకప్పుడు నా విషయంలో కూడా ఇదే జరిగింది.”అయితే ”ఇక పారితోషికం గురించి చెప్పక్కర్లేదు.
ఇక  హీరోలకి ఇచ్చేదాంట్లో సగం కూడా ఇవ్వరు. గుర్తింపు అసలు ఉండదు.

కాగా  సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు.  అయితే కానీ హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం చేస్తారు.పోతే  ఈ పరిస్థితులు మారాలి” అని తెలిపింది. ఇదిలావుంటే ఇటీవల f3 ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొనకపోవడంతో అనిల్ రావిపూడికి, తమన్నాకి విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..!!.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: