ఆది కి ఈ సినిమా అయినా కలిసొచ్చేనా!!

P.Nishanth Kumar
సాయికుమార్ తనయుడుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత కొన్ని చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. అయితే హీరోల మధ్య పోటీ పెరగడంతో పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేకపోయాడు ఆది సాయికుమార్. కొత్త దర్శకులతో సినిమాలు చేసి వాటి ద్వారా మంచి ఫలితాలను అందుకోలేకపోయాడు. దాంతో ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాపై ఎంతో ఒత్తిడి నెలకొంది అని చెప్పవచ్చు.
యూత్ ను ఆకట్టుకునే సినిమాలతో వచ్చినా కూడా అవి వారికి కనెక్ట్ కాకపోవడం నిజంగా ఆదికీ పెద్ద మైనస్ అయింది. ఆ విధంగా ఇప్పుడు చేయబోయే తీస్ మార్ ఖాన్ చిత్రంపైనే ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంట్లో మాస్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఆది సాయికుమార్ తప్పకుండా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నాడు. ఆయన గత చిత్రాలలో కంటే డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండడం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం అవుతుంది.
పెద్ద హీరోల సినిమా తరహాలలోనే హీరో పాత్ర కు మంచి మంచి ఎలివేషన్స్ ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సరికొత్తగా ఈ చిత్రం ఉండబోతుంది అని ఈ ట్రైలర్ ద్వారా చెప్పవచ్చు. మరి ఆది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సక్సెస్ ఈ సినిమా ద్వారా అందుకొని మళ్ళీ హీరోగా నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి. సక్సెస్ లేక చాలా మంది హీరోలు సినిమా పరిశ్రమంలో కొనసాగడం చాలా కష్టం. ఇప్పటికే చాలామంది హీరోలు సక్సెస్ అనేది లేకపోవడంతో సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆది సాయికుమార్ చేరకూడదు అంటే తప్పకుండా ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలి. ఆయన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మినిమం కూడా ఆకట్టుకోలేకపోవడం పెద్ద మైనస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: