నయనతార అందుకే స్పెషల్.. పెళ్ళైనా అదే రేంజ్!!

P.Nishanth Kumar
చాలామంది హీరోయిన్ లు పెళ్లయిన తర్వాత సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్ లు గా నటించి తమ గ్రామర్ ను ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటారు. అలాంటి వారి జాబితాలో చేరిపోయింది నయనతార. ఇటీవలే ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో రోజులుగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలగా ఇటీవలే వీరిద్దరూ పెళ్లి చేసుకుని దంపతులయ్యారు.

అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాల నుంచి తప్పుకుంటుందని చాలా వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలన్నీటిని పూర్తి చేసి సినిమాలకు రిటైర్మెంట్ తీసుకుంటుందని అందరూ చెప్పారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. నయనతార మాత్రం సినిమాలు ఒప్పుకుంటూనే పోతూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది. పెళ్లయిన తర్వాత కూడా తమ హీరోయిన్ లు ఈ విధంగా సినిమాలలో నటించడం వారిని ఆనందపరుస్తుంది. 

మరి దానికి తగ్గట్లే ఈ సినిమా యొక్క రెమ్యునరేషన్ అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా ఉండటం నిజంగా ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పడానికి నిదర్శనం. ప్రస్తుతం ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. షారుక్ ఖాన్ హీరోగా చేస్తున్న జవాన్ సినిమాలో ఈమె ఓ హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం. దీనికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం అందిస్తున్నాడు. వచ్చే యడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తెలుగు లో ఆమె చిరంజీవి సరసన ఓ సినిమా చేస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాలో అమెది హీరోయిన్ పాత్ర కాదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత ఆమె ఏ స్థాయి లో విజయాలను అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: