హను రాఘవపూడి కం బ్యాక్ చేసినట్లేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రేమ కథ సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు హను రాఘవపూడి. ఆయన తన తొలి సినిమా నుంచి అందమైన ప్రేమ కావ్యాలను రూపొందించి ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన రూపొందించిన తాజా సినిమా సీతారామం  ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలకు మంచి పేరు అయితే వచ్చింది కానీ ఘనవిజయం అందిందే మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. అందాల రాక్షసి సినిమా తో అయన దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత కృష్ణ గాడి వీరప్రేమ గాద, పడి పడి లేచే మనసు వంటి సినిమాలు చేశాడు. 

అయితే  ఏదో ఒక రీసన్ వల్ల సదరు సినిమాను హిట్టు చేసుకోలేకపోయాడు. కాన్సెప్ట్ పరంగా టేకింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఈ దర్శకుడు విజయాన్ని అందుకోకపోవడంతో నార్మల్ దర్శకుడుగా ఉండిపోవాల్సి వచ్చింది. మంచి టాలెంటెడ్ అయిన ఈ దర్శకుడు హిట్టు కొడితే బాగుంటుంది అని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో తడబాటు పడి హను రాఘవపూడి పెద్ద దర్శకుడు అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అయన ఎన్నో రోజులు సమయం తీసుకుని ఇప్పుడు చేసిన సినిమా విడుదల చేసి మంచి విజయం అందుకున్నాడు. 

అలా సీతారామం సినిమా విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా దాన్ని తెరకెక్కిచడం నిజంగా ఆయనకు ఎంతో క్రెడిట్ దక్కినట్లు అయింది అని చెప్పవచ్చు. దీన్ని బట్టి హను రాఘవ పూడి తన మైనస్ ల నుంచి బయటపడి ఒక హిట్ సినిమాను ఎలా చేయాలో అన్న విషయాన్ని పూర్తగా నేర్చుకున్నట్లు అయ్యింది. త్వరలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమా యొక్క అప్డేట్ వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క సక్సెస్ మూడ్ లో ఉన్న హను రాఘవపూడి ఆ తరువాత ఏ రకమైన సినిమాను చేస్తాడో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: