బింబిసార: ట్రోల్ చేసినోళ్లే శభాష్ అంటున్నారు!

Purushottham Vinay
ఇక గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కనపడటం లేదు. పెద్ద సినిమాలు తప్ప జనాలకు మామూలు సినిమాలు అస్సలు ఆనటం లేదు. ఈ నేపధ్యంలో నిన్న శుక్రవారం నాడు విడుదలైన సీతారామం, బింబిసార రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.మరీ ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ  అయితే థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నాయి.మొత్తం 16 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా వీకెండ్ షేర్ కు ఆ టార్గెట్ ను బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాను ఓ రేంజిలో కూడా పొగుడుతున్నారు.అదే సమయంలో ఓ టాక్ కూడా వినిపిస్తోంది. ఇంకా అదేమిటంటే.... ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యినప్పుడు అందరూ కూడా ప్రభాస్ బాహుబలి సినిమాతో పోల్చి చూసి నవ్వారు. చాలా మంది కూడా ట్రోల్ చేసారు. ఇప్పుడు అదే సినిమా హౌస్ ఫుల్ బోర్డ్ లుతో బాగా ప్రదర్శింపబడుతోంది.


దాంతో బింబిసార సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో అనేక రకాల పోస్ట్ లు కూడా పెడుతున్నారు. అప్పుడు ఆ ట్రోలింగ్ చూసి వాళ్లు కంగారు పడి ఉండి ఉంటే అసలు ఇంత మంచి అవుట్ ఫుట్  కూడా వచ్చేది కాదంటున్నారు.ఇక నవ్విన నాపచేను పండింది అని సామెత గుర్తు చేస్తున్నారు.మరి కొంతమంది కథల విషయంలో తారక్ జడ్జిమెంట్ కు తిరుగుండదని ఈ సినిమా సక్సెస్ తో అది ఇక మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా కథ విని ఓకే చేసిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే తన అన్న కళ్యాణ్ రామ్ బడ్జెట్ విషయంలో అసలు ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంకా అలాగే మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటలు కూడా అక్షరాలా నిజం కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: