ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్ లో 'భోళా శంకర్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి 155 వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి 40 శాతం కంప్లీట్ చేశారు.కాగా 2023 సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక వీటికంటే ముందు చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న 'గాడ్ ఫాదర్', బాబీ దర్శకత్వంలో చేస్తున్న 'వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) చిత్రాలు ఫినిష్ చేస్తారు.
ఇకపోతే దసరా కానుకగా 'గాడ్ ఫాదర్' రిలీజ్ కాబోతుంది అని ఆల్రెడీ ప్రకటించారు.కాగా సల్మాన్ ఖాన్ ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు అలాగే మెగాస్టార్ 154 వ చిత్రంగా తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) 2023 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషించనున్నారు. ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో కూడా ఓ యంగ్ హీరోకి సరిపోయే రోల్ ఉంది. అయితే చిరుకి చెల్లెలుగా చేస్తున్న కీర్తి సురేష్ కు బాయ్ ఫ్రెండ్ పాత్రలో ఆ యంగ్ హీరో కనిపిస్తుంది.
ఇక భోళా శంకర్'… 'వేదాళం' కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఒరిజినల్ లో చెల్లెలి ప్రియుడు పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇకపోతే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర ప్రాముఖ్యత పెంచారు. అయితే అందుకే ఓ యంగ్ హీరోని తీసుకోవడంతో పాటు… ఆ యంగ్ హీరోకి.. కీర్తి కి మధ్య ఓ సాంగ్ కూడా పెడుతున్నారు అని తెలుస్తుంది.ఇదిలావుంటే 'భోళా శంకర్' లో నటించబోయే యంగ్ హీరో కోసం ఇంకా అన్వేషణ జరుగుతుందని,ఏ హీరో కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం లేదు అంటూ పుకార్లు వస్తున్నాయి.ఇకపోతే అందులో ఎలాంటి నిజం లేదు.అయితే ఆల్రెడీ ఓ యంగ్ హీరో ఫైనల్ అయ్యాడు.ఇక అతను ఎవరు అనేది త్వరలోనే రివీల్ చేయనుంది చిత్ర బృందం...!!