ప్రభాస్ సినిమాల ఊసే లేదేంటి!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలు ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అంతకుముందు ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికలబడ్డాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల ద్వారా మంచి విజయాలతో ప్రేక్షకులను అలరించాలని ఆయన భావిస్తున్నాడు. రాధే శ్యామ్ విడుదల తర్వాత ఆయన సలార్ చిత్రాన్ని ఇదే సంవత్సరంలో విడుదల చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చే ఏడాది వేసవికి వెళ్లడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఆయన హీరోగా నటించే సినిమా ఈ సంవత్సరంలో మరొకటి కూడా విడుదలవుతుందని,  దాంతో రాధే శ్యామ్ బాధ నుంచి బయటపడవచ్చు అని వారందరూ భావించారు. కానీ ప్రభాస్ ఆ సినిమాల యొక్క షూటింగ్ ను నెమ్మదిగా చేయడం తో అవి లేట్ గా వచ్చే ఏడాది పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం అని చెబుతున్నారు. ఇక బాలీవుడ్ సినిమా ఆది పురుష్ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది రెండు ధమాకాలను చూడడానికి సిద్ధం చేశాడు ప్రభాస్.

మరి ఈ ఏడాది ప్రభాస్ అభిమానులు అందరూ కూడా నిరాశ పడవలసిందే అని అంటున్నారు. ఇకపోతే ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో ఓ చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  ప్రభాస్ ఏ విధంగా కం బ్యాక్ చేసి పాన్ ఇండియా హీరోగా తనను తాను నిలుపుకుంటాడో చూడాలి. త్వరలోనే ఆయన తన తదుపరి సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సారి విజయాన్ని అందుకుని అయన మళ్ళీ ఫాం లోకి వస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: