అక్కినేని హీరోలకు ఒకరు సరిపోరు.. దిల్ రాజు టంగ్ స్లిప్?

praveen
అక్కినేని హీరోలకు ఒకరు సరిపోరు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు ఏకంగా టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్రాజు. ఏంటి దిల్రాజు అంత మాట అన్నాడా అని ఆశ్చర్య పోతున్నారు కదా . అందరూ ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. కానీ అక్కడ దిల్ రాజు అన్న దానికి ఒక అర్థం ఉంటే . ఇక అందరూ అర్థం చేసుకునే దానికి మాత్రం మరో అర్థం ఉంది అని చెప్పాలి.  ఏది ఏమైనా ప్రస్తుతం అక్కినేని ఇంటి పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది అని చెప్పాలి.

 ఇప్పటికే అక్కినేని హీరోలు ఒకరితో సరిపెట్టుకోకుండా ఇద్దరి వరకు వెళ్లారు. నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను రెండో వివాహం చేసుకున్నారు. అప్పుడే కొంచెం పరువు పోయింది. ఆ తర్వాత అఖిల్ నిశ్చితార్థం చేసుకుని తర్వాత బ్రేకప్ చేసుకున్నాడు  ఇక అన్న నాగచైతన్య అయితే ఏకంగా విడాకులు ఇచ్చేసి ఇప్పుడు కాస్త సైలెంట్ గానే ఉన్నాడు. ఇలా జరగడానికి రీజన్స్ ఏవైనా అక్కినేని హీరోలు లైఫ్ లో మాత్రం ఇద్దరు మహిళలు ఉన్నారన్నది మాత్రం అందరికీ తెలిసిన నిజం. అది సరే గాని దిల్ రాజు ఆ మాట అనడానికి కారణం ఏంటి అన్నది తెలుసుకోడానికి ఎదురుచూస్తున్నారు కదా.

 ప్రస్తుతం నాగచైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమా తెరకెక్కింది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు  కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయంపై మాట్లాడిన నిర్మాత దిల్ రాజు.. అక్కినేని హీరోలకు హీరోయిన్ ఏం సరిపోతాది అంటూ సరదాగా కామెంట్ చేశాడు. తర్వాత కూడా చాలానే మాట్లాడాడు. కానీ దిల్రాజు మాట్లాడినదంత వదిలేసి కేవలం ఒక లైన్ పట్టుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. ఇలా దిల్ రాజు టంగ్ స్లిప్ అయి అక్కినేని హీరోలను ఇరికించేశాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: