ఫైమాకు ప్రపోజ్ చేసిన జబర్దస్త్ కమెడియన్.. రింగ్స్ కూడా మార్చుకున్నారు.
ఇక ఆ తర్వాత వర్ష ఇమ్మానియేల్ జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడీ అంటూ ఒక ట్యాగ్ అతికించి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లపాటు ఈ జోడీ పైనే కంటెంట్ క్రియేట్ చేయడం కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టడం లాంటివి కూడా చేశారు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి ఫైమా, ప్రవీణ్ మధ్య కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలికాలంలో ఒకవైపు ప్రవీణ్ మరోవైపు ఫైమా తమదైన టాలెంటుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ జబర్దస్త్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారూ.
ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వీరు భాగమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా సీరియల్ జోడీలు వచ్చి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారూ. ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ పర్ఫామెన్స్ చేయడానికి వెళ్తారు. ఒక బెడ్ పై మోకాళ్ళమీద నిల్చొని రొమాన్స్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు. ఈ క్రమంలోనే చివర్లో ఫైమా, ప్రవీణ్ వస్తారు ఇదంతా పూర్తయిన తర్వాత ప్రవీణ్ పైమా కి ప్రపోజ్ చేస్తాడు. ఒక అబ్బాయిలా బాధ్యత తీసుకొని తన తల్లికి సొంతిల్లు కట్టించడం ఎంతో నచ్చిందని ఆమెపై గౌరవం పెరిగిందని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. అంతే కాదు మీ అమ్మకు చెప్పు అల్లుడు వచ్చేస్తున్నాడు అని అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇది చూసిన తర్వాత ఇలాంటివి చాలానే చూసాములే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు