మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ అవడం చిత్ర దర్శక నిర్మాతలకు ఎంతో ఇబ్బందిని తెచ్చిపెట్టింది. సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడతారు అన్న మాట వినడమే కానీ ఎప్పుడు చూడలేదు కొంతమంది ప్రేక్షకులు. అలాంటి వారు ఇప్పుడు కొరటాల శివ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఎంతో బాధపడుతున్నారు. ఆ విధంగా కొరటాల శివ తన తదుపరి సినిమా చేస్తున్న కూడా ఈ చిత్రం తాలూకు ఎఫెక్ట్ ఇంకా వెళ్లకపోవడం అందరిని ఎంతగానో నిరాశ పరుస్తుంది.
ఎన్టీఆర్ తో ఆయన తదుపరి సినిమాను చేస్తున్నాడు ఇక హీరో చిరంజీవి కూడా తన తదుపరి సినిమాలకు వెళ్లిపోయి వాటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేసిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల పనులలో నిమగ్నమై ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది. దానికి మెగా అభిమానుల నుంచి స్పందన వేరే స్థాయిలో వచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి మళ్ళీ కమ్ బ్యాక్ చేయడం గ్యారెంటీ అని అందరూ భావిస్తున్నారు.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కిస్తూ ఉండగా ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . రీమేక్ సినిమానే అయినా తెలుగు నేటివీటికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్త ఉండడం విశేషం. నయనతార మరియు సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా నటిస్తున్నాడు. ఆయన పాత్ర ఈ చిత్రంలో ఎలాగ ఉంటుందో చూడాలి. హిందీలో ఈ సినిమాకు క్రేజీ రావడం కోసమే సల్మాన్ ఈ చిత్రంలో నటించాడనీ అంటున్నారు. మరి సినిమా పరంగా చిరంజీవి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్థాడో చూడాలి. ఈ చిత్రం తర్వాత మరొక రెండు సినిమాలతో చిరంజీవి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు