సత్యదేవ్ అక్కడే సినిమాలు చేసుకుంటే మంచిది..!!
అలా ఎన్నో సంవత్సరాలు హీరో గా చేసిన తర్వాత ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించి మంచి అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి హీరోగా ఎదుగుతున్న ఈ హీరో సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువవుతుంది చెప్పాలి. ఆయన సినిమాలకు మంచి అప్లాజ్ వస్తుంది కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆ సినిమాలు అలరించలేకపోతున్నాయి. కానీ ఓటీటీలో ఆయన చిత్రాలకు మంచి గుర్తింపు దక్కుతుంది.
ఆయన హీరో గా నటించిన తాజా సినిమా 'గాడ్సే' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమా కు పెద్దగా ఆదరణ దక్కలేదు. అందుకే ఈ సినిమా జూలై 17 నుండి ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి. ఓటీటీ లో ఈ హీరో సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సికె స్క్రీన్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మించిన ఈ థ్రిల్లర్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను ఓటీటీ లో చూడడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.