పుష్ప 2 కి అంత సీన్ ఉందా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా మలయాళ నటుడు హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ తో రెండవ భాగాన్ని కూడా ప్రేక్షకులను అబ్బురపరచాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ను పూర్తిగా మారుస్తున్నారు. లేదంటే ఇప్పటికే ఈ సినిమా మొదలుపెట్టేవారు.
ఈ స్క్రిప్ట్ కోసం సుకుమార్ కొంతమంది ఇతర భాష రచయితలను కూడా ఉపయోగిస్తున్నారు అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడుతుంది అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుకాబోతుంది. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. అదేమిటంటే రికార్డుల విషయంలో ఈ చిత్రం బాహుబలి ని మించి పోతుందని వారు చెప్తున్నారు.
బాహుబలి సినిమా రికార్డులను అధిగమించడం అంత మాములు విషయం కాదు. చారిత్రాత్మక సినిమా గా వచ్చిన ఈ సినిమా చాలా భాషల్లో విడుదలై ఇంతటి వసూళ్లను సాధించింది కానీ ఒక నార్మల్ సినిమా అన్ని వసూళ్లు సాధించాలి అంటే వేరే లెవెల్ సినిమా అయ్యి ఉండాలి. పుష్ప రెండవ భాగం సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి కానీ అంతటి స్థాయి కలిగిన సినిమానా అనేది ఇక్కడ అసలు విషయం. ఎంతలేదన్నా ఈ సినిమా కు మంచి వసూళ్లు వస్తాయి కానీ బాహుబలి సినిమా రికార్డులను తలదన్నే రికార్డులను మాత్రం ఇది దక్కించుకోలేదనే చెప్పాలి. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టుకోబోతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల చేయాలన్నది సుకుమార్ ఆలోచన. మరి ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: