బాక్సాఫీస్ షాకే అవ్వాల్సిందే ఇక..!!

P.Nishanth Kumar
బాక్సాఫీస్ వద్ద ముగ్గురు అగ్ర హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోలుగా ఉన్న ఈ ముగ్గురు కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకోవడం నిజంగా అందరినీ ఆసక్తి పరిచే విషయం అనే చెప్పాలి. వాస్తవానికి ఈ ముగ్గురు హీరోలు కూడా వేరు వేరు సమయాల్లో సినిమాలు మొదలుపెట్టినప్పటికీ ఒకేసారి విడుదల అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండడం విశేషం. 

ఇంతకీ ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో అని అనుకుంటున్నారా!! వారే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మరియు నందమూరి బాలకృష్ణ. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు తమ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.  చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.  ఈ సినిమా ను దసరా కనక విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదల కాగా ఇందులో దీనికి సంబందించిన విషయం స్పష్టం చేశారు. 

ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా కూడా దసరాకు విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం ముందుకు రాబోతున్నగా ఈ చిత్రం మంచి విజయం సాధించుకుంటుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇకపోతే అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ఘోస్ట్ సినిమాని కూడా దసరాకు విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యి సినిమాపై అంచనాలను పెంచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు నాగార్జున. మరి టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న ఈ ముగ్గురు ఒకేసారి సినిమాలను విడుదల చేయడం నిజంగా మంచి సీజన్ అనే చెప్పాలి. ముగ్గురుకి మంచి అభిమానులు ఉన్నారు. వీరు కనుక మంచి హిట్ కొడితే దసరా సీజన్ కలెక్షన్స్ తో నిండిపోవడం ఖాయం అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: