బ్లడ్ రిలేషన్ లేని.. ఎన్టీఆర్ ముగ్గురు అన్నలు ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . నిన్ను చూడాలని ఉంది అనే సినిమాలో ఒక సాదాసీదా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇక నూనూగు మీసాలు వస్తున్న సమయంలోనే ఏకంగా సింహాద్రి, ఆది ఇలాంటి సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్లు కొట్టి స్టార్ హీరోలకు సైతం షాకిచ్చాడు. ముఖ్యంగా  రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అని చెప్పాలి. చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన కొన్నాళ్లకే స్టార్ హీరోగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్.


 తర్వాత కాలంలో కెరీర్లో వరుస ఫ్లాప్ ను చవి చూడటం తో ఎన్టీఆర్ కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సక్సెస్ బాట పట్టాడు  ఈ నందమూరి హీరో.  ఇక వరుసగా రెండు హ్యాట్రిక్ విజయాలను సాధించాడు జూనియర్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. మొన్న త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు. అయితే ఒక తల్లి బిడ్డల కాకపోయినప్పటికీ అటు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు  ఎంతో అమితమైన ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు.


 అయితే జూనియర్ ఎన్టీఆర్ తోడబుట్టిన తమ్ముడు కాకపోయినప్పటికీ.. కనీసం జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి బ్లడ్ రిలేషన్ షిప్ లేకపోయినప్పటికీ ముగ్గురు వ్యక్తులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను సొంత తమ్ముడి గా భావిస్తూ ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారట. ఆ ముగ్గురు ఎవరో కాదు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వి.వి.వినాయక్. ఎన్టీఆర్ కు ఎప్పుడు తోడునీడగా నిలవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలోనే అప్పట్లో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్కు అదుర్స్ సినిమాతో ఈ ముగ్గురు అన్నలు కూడా ఎన్టీఆర్ హిట్ ఇవ్వాలని అనుకున్నారట. ఎన్టీఆర్ కూడా ఎన్నోసార్లు తన జీవితంలో ఎంతో ఆత్మీయులు అంటూ ఈ ముగ్గురి పేరు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nt4

సంబంధిత వార్తలు: