ఏంటి.. సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు.. ఇన్ని ఆరోగ్య సమస్యలున్నాయా?
కానీ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కూడా అన్నపూర్ణమ్మ సందడి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ఇప్పటివరకు ఎన్నో ఎపిసోడ్ లలో తనదైన శైలిలో అలరించారు అన్నపూర్ణమ్మ. ఇక జబర్దస్త్ కమెడియన్స్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. అయితే నిజ జీవితంలో కాదులేండి జబర్దస్త్ లో ఒక స్కిట్ లో భాగంగా అన్నపూర్ణమ్మ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు.
ఏం జరిగిందంటే ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో భాగంగా ఆటో రాంప్రసాద్ టీం లో కామెడీ పంచేందుకు వచ్చారు అన్నపూర్ణమ్మ. ఈ క్రమంలోనే ఫేక్ పేషెంట్ అంటూ ఆమెను పిలిచిన డాక్టర్ వేషంలో ఉన్న రాంప్రసాద్ పేషెంట్ లాగా ఎలా నటించాలో మీకు నేర్పిస్తాను అంటూ చెబుతాడు. దీంతో నాకు షుగర్ వచ్చినప్పుడు నువ్వు బచ్చాగాడివి.. నాకు అల్సర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా యాక్టర్ కూడా కాలేదు.. అలాంటి నువ్వు నాకు యాక్టింగ్ నేర్పించడం ఏంటి అంటూ ఒక డైలాగ్ చెబుతుంది అన్నపూర్ణమ్మ. దీంతో మీకు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అంటూ ఆటో రాంప్రసాద్ పంచ్ వేస్తాడు.