ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు వరుసగా బాక్సఫీస్ వద్ద డిజాస్టర్ అవడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అదే సమయం లో ఆయనకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోవడం ఇప్పుడు అదే అభిమానులను కలవరపరుస్తుంది. బాహుబలి సినిమాతో భారీ రికార్డులను నెలకొల్పిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన రెండు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించ లేకపోయాడు. దాంతో అయన సినిమాలను ఎంపిక చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో విమర్శలు కూడా బాగానే ఎదుర్కున్నాడు.
ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహూ చిత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకోవడంతో ప్రభాస్ నుంచి రావాల్సిన సినిమాగా దీన్ని పరిగణించలేదు ప్రేక్షకులు. మంచి కలెక్షన్లు వచ్చినా కూడా ఈ చిత్రాన్ని ఫ్లాప్ కిందే లెక్కేశారు. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ చిత్రం కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఇటు వసూళ్లను పరంగా అటు టాక్ పరంగా డిజాస్టర్ అయ్యింది. అలా ఇప్పుడు చేస్తున్న సలార్ చిత్రం పైన అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.
ఒకవేళ ఈ రెండు సినిమాలు కనుక తేడా ఫలితాలను అందుకుంటే మాత్రం తప్పకుండా ప్రభాస్ పని అయిపోయిందని లెక్కేస్తారు. ఇది ఊహించుకుంటేనే ప్రభాస్ అభిమానులను ఎంతో కలవరపాటు గురిచేస్తుంది. మరి ప్రభాస్ గతంలోలా మంచి సినిమాలను చేసి హిట్ లు సాధించి ప్రేక్షకులను అలరిస్తారా అనేది చూడాలి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రాలను చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే ఆ సినిమాలు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేశారు దర్శకులు.