పండగల సీజన్ సినీప్రియలకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఒకవైపు పండగ హడావుడి ఇంకొక వైపు సినిమాల హడావుడి కలసి పండగ సీజన్ సినిమా ప్రియులకు ఎంతో స్పెషల్ గా నిలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఏడాది దసరా మరింత స్పెషల్ గా నిలవబోతోంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆ సీజన్ లో ఏకంగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు తెలుగు నాట అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉండడంతో ఈ చిత్రాలకు సంబంధించి ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో దసరా కి విడుదల కాబోయే చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోవడం ఈ చిత్రం దసరాకి విడుదలవుతుంది అని చెప్పడానికి నిదర్శనంగా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క పలు పోస్టర్లు విడుదల కాగా అవి చిత్రం పై మంచి అంచనాలను పెంచాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా లో సల్మాన్ ఖాన్, నయన తార, సత్యదేవ్ కీలక పాత్ర లు పోషిస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నూట ఏడవ సినిమా కూడా దసరాకే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం అందిస్తున్నారు. అలా చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద దసరా పండుగకు పోటీ పడబోతున్నారు. గతంలో ఎవరు పై చేయి సాధించారు అనేకంటే పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టుకున్నాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరొకని క్రేజీ సినిమాలు కూడా దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు మరి కొన్ని రోజులు ఆగితే ఏ సినిమాలు దసరా కోసం పోటీ పడతాయో తెలుస్తుంది.