టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ప్రస్తుతం ఈయన వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఇక గోపీచంద్ రేంజ్‌కు తగిన హిట్ పడి చాలా యేళ్లు అయ్యింది. పోతే సిటీమార్‌కు టాక్ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా అనుకున్న రేంజ్‌కు చేరుకోలేదు.ఇదిలా ఉంటె ఇక ఐదారేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన అరడుగులు బుల్లెట్ డిజాస్టర్ అయ్యింది.అయితే ఈ క్రమంలోనే గోపీచంద్ తాజాగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ .. యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఇకపోతే ఈ సినిమాలో ఇటు రాశీఖన్నా హీరోయిన్‌గా నటించడంతో పాటు రెండు పెద్ద బ్యానర్లు అయిన యూవీ క్రియేషన్స్, జీఏ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మించడంతో టీజర్లు, ట్రైలర్లు ప్రామీసింగ్‌గా ఉండడంతో పక్కా కమర్షియల్‌పై ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.అయితే ఇక అసలు ప్రమోషన్లు మాత్రం ఈ సినిమాకు మామూలుగా జరగడం లేదు. అంతేకాదు హీరో గోపీచంద్‌కు కూడా ముందే సినిమాపై మంచి నమ్మకం ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పర్యటనలు కూడా చేస్తున్నాడు.ఇదిలావుంటే ఈ సినిమాను జూలై 1 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా పక్కా కమర్షియల్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.కాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.అంతేకాదు ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాల నిడివి తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యింది.ఏంటంటే 152 నిమిషాల పాటు రన్ టైం ఉంటుంది.అయితే తాజాగా ఇప్పడు వస్తున్న సినిమాల రన్ టైంతో పోలిస్తే ఇది పెద్ద ఎక్కువేం కాదు. అంతేకాక సినిమాలో కామెడీతో పాటు యాక్షన్‌కు ఎక్కువ స్కోప్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరి గోపీచంద్ ఈ సినిమాతో అయినా పక్కా కమర్షియల్ హిట్ కొడతాడేమో రెండు రోజుల్లో తేలిపోనుంది..!!