రామ్ సినిమాలో తమిళ స్టార్ హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన బోయపాటి..?

Anilkumar
తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ది వారియర్ . అయితే ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా..కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది అయితే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా  ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే పలు అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అయితే తాజాగా క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.. ఇక ఈ మూవీలో తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నాడట.. కాగా శివకార్తికేయన్, రామ్ పోతినేని కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి.. ఇక అంతేకాదు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నాడటట.. అయితే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్, శివకార్తికేయన్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్..అయితే  ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు బోయపాటి.. 

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఇకపోతే ఇప్పుడు రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా తాజాగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నం డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగులో భారీ మార్కెట్ సాధించాలని చూస్తున్నాడు ఈ తమిళ హీరో. ఇప్పుడు బోయపాటి రామ్ పోతినేని సినిమాలో కూడా నటించబోతుండటంతో కచ్చితంగా ఈ హీరో తెలుగులో భారీ మార్కెట్ సాధించే అవకాశాలు ఉన్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: