అనసూయ పక్కా కమర్షియల్.. జబర్దస్త్ యాంకర్ పరువు తీసిన డైరక్టర్..!

shami
హాట్ జబర్దస్త్ యాంకర్ అనసూయ పక్కా కమర్షియల్ అని.. ఆమెకు పిలిచి అవకాశం ఇస్తానన్నా సరే రెమ్యునరేషన్ భారీగా అడుగుతుందని. పాత్రల ఎంపిక విషయంలో కూడా కమర్షియల్ గా ఆలోచిస్తుందని అన్నారు డైరక్టర్ మారుతి. మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ షోకి అటెండ్ అయ్యారు. గోపీచంద్, మారుతి కలిసి జబర్దస్త్ షోకి వచ్చారు. ఆ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేయగా ఆ ప్రోమోలో అనసూయ పక్కా కమర్షియల్ అని అవకాశం ఇస్తానన్నా వద్దంటుందని అన్నారు మారుతి.
మారుతి అలా అంటుంటే అనసూయ ఆయన నోరు నొక్కేయాలని ప్రయత్నించింది. అంతేకాదు నో నో నో అంటూ అరిచింది. ఇంతకీ మారుతి ఏ సినిమా ఆఫర్ ని అనసూయ కాదన్నది అన్నది తెలియాల్సి ఉంది. జబర్దస్త్ యాంకర్ గా సత్తా చాటుతున్న అనసూయ ఓ పక్క యాంకర్ గా అదరగొడుతూనే మరోపక్క సెలెక్టెడ్ సినిమాలతో ఊపు ఊపేస్తుంది. అనసూయ సినిమాలో ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రత్యేకమైన పాత్ర అయి ఉండాల్సిందే. ఇప్పటివరకు అనసూయ చేస్తూ వచ్చిన పాత్రలన్ని అదే రకమైన క్రేజ్ ని తీసుకొచ్చాయి.
అయితే మారుతి డైరక్షన్ లో అనసూయ కి ఛాన్స్ ఇచ్చినా అనసూయ కాదని చెప్పినట్టు ఉంది. అందుకే అనసూయ పక్కా కమర్షియల్ ఛాన్స్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తుందని జబర్దస్త్ యాంకర్ పై అదిరిపోయే పంచ్ వేశాడు మారుతి. ఇక పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే కామెడీ ఎంటర్టైనర్ గా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: