హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై స్వామి రారా కార్తికేయ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న హీరో నిఖిల్. యువతలో మంచి క్రేజ్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న కార్తికేయ సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకున్నాడు. గత కొన్ని సినిమాలుగా ఆయన చేస్తున్న సినిమాలతో విజయాన్ని అందుకోలేక పోయినా ఈ హీరో ఇప్పుడు హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు ఆయన అభిమానులు కలిగి ఉన్నారు.
కార్తికేయ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇంతటి స్థాయిలో అంచనాలు కలిగి ఉన్నాయి. మిస్టరీ నేపథ్యంలో హర్రర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నిఖిల్ లాంటి హీరో నటిస్తూ ఉండటంతోనే ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో క్రేజ్ ఉంది అని చెప్పాలి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన గత సినిమాల మాదిరిగానే మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటే నిఖిల్ మరి కొన్ని సినిమాలు కూడా పూర్తి చేశాడు. సుకుమార్ నిర్మాణంలో ఆయన లవ్ కథా కథనాల తో కలిసి ఓ సినిమా తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తప్పకుండా మంచి సినిమాగా మిగులుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా త్వరలో రాబోతుంది. ఇకపోతే ఇటీవల స్పై ఆమె మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు నిఖిల్. ఇది మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఫుల్ బిజీగా ఉన్న నిఖిల్ ఈ సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకొని భారీ క్రేజ్ ను అందుకుటాడో చూడాలి.