విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది ఏంటి మరీ..!!

P.Nishanth Kumar
ప్రస్తుతం పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ. ఒకే సారి రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటూ తన సత్తాను చాటుతున్నాడు. ఒకవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జేజీఎమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకొకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ఖుషీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హీరో హీరోయిన్ లు మరియు మరికొంతమంది నటీనటుల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే హీరో లేని సన్నివేశాలను రాజస్థాన్ లో జే జీ ఎమ్ సినిమా కోసం చేస్తున్నారు. అలా ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఖుషి సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. మొన్నటిదాకా కశ్మీర్లో ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ జరగగా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఆ విధంగా ఈ రెండు సినిమాలను ఈ ఏడాది పూర్తి చేయాలన్నది విజయ్ దేవరకొండ టార్గెట్ గా తెలుస్తుంది. ఇంకొక వైపు ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూర్తి చేసిన లైగర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఈ చిత్రంతో భారీ సక్సెస్ను అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల అవుతుంది. మరి ఈ ఏడాది మూడు సినిమాలను పూర్తి చేస్తున్న విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా చేస్తున్న సుకుమార్ వచ్చే ఏడాదికల్లా ఆ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లోనీ ఈ మొదటి సినిమా ఏ స్థాయిలో తెరకెక్కి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: