నేను లేనప్పుడు సాయి పల్లవిని పిలిచారు.. ఉంటేనా : రానా
ఇది కాస్త సంచలనంగా మారగా ఈ వివాదంపై ఇటీవలే సాయి పల్లవి స్పందించింది. ఇది ఈ వివాదాలకు సమాధానం చెప్పే సమయం కాదని.. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది సినిమా ప్రమోషన్ అలాగే అవుతుందని.. దానికి తగిన సమయం చూసి సమాధానం చెబుతానని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ప్రస్తుతం విరాటపర్వం విడుదల అవుతుంది అన్న ఆనందంలో ఉన్నానని అందరూ సినిమా చూడాలి అంటూ కోరింది. అయితే ఇదే వివాదంపై అటు హీరో రాణా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను లేని సమయంలో సాయి పల్లవి ఇంటర్వ్యూ కి పిలిచారు. నేను ఉండి ఉంటే అక్కడి వరకు రానిచ్చేవాడిని కాదు.
ఇంత పెద్ద ప్రెస్మీట్ లో వివాదాల గురించి మాట్లాడలేము. దానికి ఒక సమయం సందర్భం ఉండాలి. సినిమా విడుదల తర్వాత అన్నింటికీ సాయి పల్లవి సమాధానం చెబుతుంది. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ప్రస్తుత సమాజ పరిస్థితులు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి అని అంటూ దగ్గుపాటి రానా చెప్పుకొచ్చాడు. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అనే చెప్పాలి .ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవకుండా ఉండలేకపోతున్నాడు.