మహేష్ బాబు హీరోగా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రాగా వెండితెరపై రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే బుల్లితెరపై ఈ సినిమాలు భారీ స్థాయిలో విజయాలను అందుకున్నాయి అందుకే మహేష్ బాబు మరొకసారి ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా గత కొన్ని సినిమాలుగా మంచి విజయాలను సాధిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్నాడు.
ఆ విధంగానే మహేష్ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించి వారి మధ్య ఉన్న ఆ మాత్రం గ్యాప్ ను తొలగించుకోవాలని ఆయన భావిస్తున్నాడు వాస్తవానికి మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా చేయడం పట్ల కొంత ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ వారి పాట సినిమా యావరేజ్ కావడమే . సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉన్నా కూడా బయటికి వచ్చిన తర్వాత ఏదో వెలితి అనిపిస్తున్న కారణంగా ఈ సినిమా యావరేజ్ అని చెప్పడానికి కారణం అని కొంత మంది ప్రేక్షకులు చెబుతున్నారు.
మహేష్ బాబు స్థాయికి సినిమా చేయవలసి ఉండేది కాదని వారు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే అలాంటి యావరేజ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేకంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడం మంచిది అని చెబుతున్నారు. కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా చేయడం ఖరారు అయిపొయింది. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో వారు ఏ విధమైన విజయాన్ని అందుకుంటారో చూడాలి.. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమాను విడుదల చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తుండగా అదే సమయంలో రాజమౌళి తన సినిమాను మొదలు పెట్టడానికి చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయి లో ఉంటుందో చూడాలి.