ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు లోకేష్ కనగరాజ్.అయితే ప్రస్తుతం ఈ పేరు దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తుంది.ఇక రాజమౌళి.. ప్రశాంత్ నీల్ తర్వాత అంతటి స్థాయిలో ఈ దర్శకుడి పేరును ఈ మద్య కాలంలో జాతీయ మీడియాలో చూడటం జరిగింది.ఇకపోతే యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో 'విక్రమ్' సినిమాను తెరకెక్కించారు.అయితే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత చిత్రం 'ఖైదీ' కి సీక్వెల్ చేయబోతున్న విషయమై క్లారిటీ ఇచ్చాడు.కాగా చాలా రోజులుగా ఖైదీ సినిమా కు సీక్వెల్ ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. ఎప్పుడు సీక్వెల్ ఉంటుంది అనే విషయంలో మాత్రం కాస్త అనుమానం ఉండేది. ఇప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించిన లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమా ల విషయమై మాట్లాడుతూ ...
.పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.అయితే ఒక అభిమాని ఖైదీలో చనిపోయిన అర్జున్ దాస్ పాత్ర 'విక్రమ్' సినిమాలో ఎలా బతికి వచ్చిందంటూ ప్రశ్నించాడు. అంతేకాదు ఆ ప్రశ్నకు లోకేష్ చాలా క్లియర్ గా సమాధానం చెప్పడంతో పాటు ఖైదీ సీక్వెల్ కు సంబంధించి అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే అన్బుకు కేవలం గాయం అవుతుంది. దాన్ని విక్రమ్ లో చూడవచ్చు.ఇక ఆ విషయాన్ని మరింత క్లారిటీగా ఖైదీ 2 లో చూపించబోతున్నట్లుగా సమాధానం ఇచ్చాడు.ఇదిలావుండగా మొదటి నుండి కూడా లోకేష్ తన తదుపరి సినిమా ఖైదీ 2 ను విక్రమ్ సినిమా తో లింక్ చేశాడని వార్తలు వస్తున్నాయి.ఇక నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా.. నిజంగానే ఖైదీ సీక్వెల్ కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను విక్రమ్ లో లోకేష్ టచ్ చేయడం జరిగింది.
అయితే ఖైదీ 2 లో ఖచ్చితంగా విక్రమ్ లో కనిపించిన రోలెక్స్ పాత్ర ఎక్కువ ఉండబోతుందని సమాచారం అందుతోంది.అంతేకాదు త్వరలో లోకేష్ మరియు విజయ్ ల మూవీ పట్టాలెక్కబోతుందనే వార్తలు తమిళ మీడియాలో వస్తున్నాయి. ఇక విజయ్ తో సినిమా ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయట.ఇకపోతే ఖైదీ 2 ను ఇదే ఏడాది చివరి నుండి పట్టాలెక్కించే అవకాశాలు లేకపోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ త్వరలో ఒక తెలుగు సినిమాను కూడా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.