మర్యాద రామన్నలో సునీల్‌తో కనిపించిన కుర్రాడు ఎవరో తెలుసా.. ఇప్పుడు స్టార్ నటుడు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి సునీల్ కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడం , అందాల రాముడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సునీల్ హీరోగా నటించిన రెండవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక మర్యాద రామన్న సినిమాతో ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఈ మూవీ తో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు పెరిగింది. ఇకపోతే పైన ఓ ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటో మర్యాద రామన్న సినిమాలోని ఓ సన్నివేశంలోది. ఇక పైన ఫోటోలో సునీల్ తో పాటు ఓ కుర్రాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆ కుర్రాడు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించగా అందులో ఆయన రెండు సినిమాలతో విజయాలను కూడా అందుకున్నాడు.
 

ఇకనైనా ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు ఎస్ ఎస్ రాజమౌళి సోదరుడు అయినటువంటి ఎం ఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ. శ్రీ సింహ , రితీష్ రాణా దర్శకత్వంలో రూపొందిన మత్తు వదలరా సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఈయన మత్తు వదలరా 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: