కంగువ: థియేటర్ లో ఖంగుతిన్న సూర్య..ఓటీటీలో మాత్రం..?

FARMANULLA SHAIK
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం కంగువ.సూర్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కించారు.అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.మొదటి షో నుంచే కంగువకు నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఆసక్తి చూపలేదు.విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తప్పకుండా కోట్లలో కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులతో పాటు మూవీ మేకర్స్ కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ విడుదల తర్వాత అంచనాలు కాస్త మారిపోయాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువ సినిమా ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అయితే థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కంగువ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది.
కంగువ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డును సృష్టించింది. కాగా దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సినిమా చాలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్ర బృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ సినిమాలోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో డైలాగ్ అర్థం కావడం లేదని సినిమా చూసిన వారు విమర్శించారు. థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని కంగువ ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది.కంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా.. ఓటీటీలో మంచి మంచి ఆదరణ అందుకుంటుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. కాగా యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా సూర్య హీరోగా తెరకెక్కిన కంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించచిన విషయం తెలిసిందే. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో 10కి పైగా భాషల్లో రూపొందింది. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: