విడుదల అయ్యి ఎంతో కాలమైనా ఓటిటిలోకి ఎంట్రీ కానీ సినిమాలివే..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో ఓ టి టి ప్లాట్ ఫామ్ ల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ ను కూడా ప్రేక్షకులు పెద్దగా చూసేవారు కాదు. కానీ ఎప్పుడూ అయితే దేశం లోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఓ టీ టీ ల ప్రభావం మన దేశ ప్రజలపై బాగా పడింది. ఎక్కువ శాతం ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ ను చూడడానికి మన దేశ ప్రజలు ప్రస్తుతం ఇష్టపడుతున్నారు. దానితో ఏదైనా సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది అంటే చాలు చాలా తక్కువ రోజుల్లోనే ఏదో ఒక ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కొన్ని సినిమాలు నేరుగా కూడా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతున్నాయి.

ఇక మరికొన్ని సినిమాలు విడుదల అయిన నెలలోపు ఓ టీ టీ లోకి వస్తే కొన్ని పెద్ద సినిమాలు , బ్లాక్ బాస్టర్ సినిమాలు విడుదల అయిన 50 రోజుల తర్వాత  ఓ టీ టీ లోకి వస్తున్నాయి. ఇకపోతే ఏవో కొన్ని మంచి క్రేజ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలు మాత్రమే ఓ టీ టీ లోకి రాకుండా మిగిలిపోతున్నాయి. అలా మంచి క్రేజ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలు విడుదల అయ్యి చాలా కాలమే ఓ టి టి లోకి రాకుండా మిగిలిపోయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ ఆఖరుగా ఏజెంట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ విడుదల అయ్యి చాలా  కాలమే అవుతున్న ఇప్పటివరకు ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపోతే శర్వానంద్ కొంత కాలం క్రితం మనమే అనే సినిమాలో హీరోగా నటించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు ఏ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: