ఆలోచనలలో మార్పు.. 2025 లో Gen Z థాట్స్ ఇవే..!
ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ట్రైనింగ్ ఫాలో అవుతున్నారు. ప్రతిక్షణం... ప్రతి నిమిషం... ప్రతి గంట... ప్రతిరోజు .. ఇలా చేస్తుండగానే అలా గడిచిపోతుంటాయ్... అవును మరి కాలం ఎవరి కోసమో ఆగదు. ఎవరిమీదా దానికి దయ, జాలి, ప్రేమ, అసూయ, పక్షవాతం వంటివి ఏవి ఉండవు. అందరికీ ఒకేలా వర్తిస్తుంది. మనకు నచ్చిన నచ్చకపోయినా, మనం మారినా, మారకపోయినా కాలానికి సంబంధం లేదు. అది మాత్రం మారుతూనే ఉంటుంది. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మనం కూడా కాలంతో పాటు పరిగెత్తాలి. కాలాన్ని అర్థం చేసుకోకపోతే, కాలం విలువ తెలుసుకోవాలి. లేకపోతే అక్కడే ఆగిపోతాం...
ఇప్పడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే... మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఈ క్రమంలో యువత, సంబంధాల విషయంలో ఎలా ఆలోచిస్తుంది? ఏ విధమైన మార్పు కోరుకుంటుందో కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే సమాజంలో ప్రతీది మార్పునకు లోబడే ఉంటుంది. అంతెందుకు కొన్ని రోజుల్లోనే మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఇది మార్పే కదా... అయితే కాలం ఒక్కటే కాదు. మనుషుల, మానవ సంబంధాల్లోనూ మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాబోయే 2025 సంవత్సరంలో 2024 లోని ట్రెండ్స్ అన్ని పాతబడిపోతాయి. అవసరం అయినవి కొన్ని స్పిడప్ అవుతాయి లేదా మరింత మెరుగైన దిశగా మారుతాయి. అలాంటి వాటిలో మానవ సంబంధాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా జెన్ జీ డేటింగ్ స్టైల్ కూడా మారనుందని నిపుణులు అంటున్నారు. న్యూ జనరేషన్ డేటింగ్ ట్రెండ్స్ కాంప్లికేటెడ్ నుంచి మరింత సింప్లిసిటిలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదంతా ఎలాగో గడిచిపోయింది. కొందరు సంతోషంగా, సానుకూలంగా భావించి ఉండవచ్చు. మరికొందరు గజిబిజిగా, గందరగోళంగా గడిచిందని బాధపడుతుండవచ్చు. ఎలా భావించేవారైనా మారాల్సిందే. అయితే వచ్చే సంవత్సరంలో ప్రజలు ఎక్కువగా, ముఖ్యంగా యువత వ్యక్తిగత సంరక్షణ, చెట్టుకి కదా ఎదుగుదల, మానసిక ఆనందం, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.