ఒకప్పుడు చాలా సింపుల్ గా, పద్దతిగా కనిపించి మంచి పేరును తెచ్చుకుంది.ఫిధా సినిమాలో అచ్చ మైన తెలుగు అమ్మాయిలాగా కనిపించి ఆకట్టుకుంది..ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకొలేదు.తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలలో కనిపించి జనాలను విపరీతంగా అలరించింది.ప్రస్తుతం ఈ అమ్మడు పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పునకాలు వస్తున్నాయి.కేవలం నటన ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి పల్లవి మొదటి నుండి కూడా నిజాయితీ అనే ఫార్ములానే ఫాలో అవుతుంది.
నిజాయితి పదానికి విలువ ఇచ్చే వాళ్లు తక్కువ..అలాంటిది, స్టార్ హీరోయిన్ గా ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ ని ఇష్టపడుతూ.. అందరిని ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. అంతేకాదు గ్లామరస్ షోలు చెయ్యను అని ఉన్నది మోహానే చెప్పే క్యారెక్టర్ అమ్మడుది.మన ఇండస్ట్రీలో సాయి పల్లవి తో సినిమాలు చెయ్యాలనే నటులు చాలా మందే ఉన్నారు. అంతెందుకు ఏకంగా చిరంజీవినే ..లవ్ స్టోరీ సినిమా టైంలో.."నీతో ఒక్క సినిమా ప్లీజ్ సాయి పల్లవి "అంటూ అడిగేశారు. అంత బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాలని. మలయాళం ,తెలుగు, తమిళంలో మంచి పేరు సంపాదించుకున్న సాయి పల్లవి..మరి కొద్ది రోజుల్లో.."విరాట పర్వం" అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది.
వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది.ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది.బాలీవుడ్ మల్టీ టాలెంటేడ్ నటుడు, నిర్మాత కరణ్ జోహార్ సాయి పల్లవిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ట్రైలర్ చాలా స్టన్నింగ్ గా ఉందని..సాయి పల్లవి నటన సూపర్ అని..ఆమెకు తను ఫ్యాన్ అంటూ ఆసక్తికరంగా ఉందంటూ పోస్ట్ చేశాడు.అంతేకాదు అతను హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు ఆమెను గెస్ట్ గా తీసుకురావాలని ప్లాను చేస్తున్నాడు.సాయి పల్లవిని కూల్ చేస్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు గుర్తు రాని సాయి పల్లవి ఇప్పుడే గుర్తు వచ్చిందా అని కామెంట్లు చేస్తున్నారు.