కమల్ జోరు మాములుగా లేదుగా..!!

P.Nishanth Kumar
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా సంచలన విజయం సాధించితిన్ విషయం అందరికి తెలిసిందే. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ ఈ స్థాయి లో విజయాన్ని అందుకున్నారు. వయసు మీద పడడమో లేదా కొత్త హీరోలు రావడమో కానీ ఆయన కు క్రేజ్ బాగానే తగ్గిపోయింది. దానికి తోడు ఆయన సినిమాలు కూడా పెద్ద విజయం సాధించేవి కాదు. దాంతో ఆయన మార్కెట్ దాదాపుగా పడిపోయిందని అందరు అనుకున్నారు. కానీ విక్రమ్ సినిమా ఆయనకు మళ్ళీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి.

నటుడిగా కమల్ హాసన్ కి ఎలాంటి మచ్చ లేదు. అయితే ఎప్పుడైతే ఆయన రచన, దర్శకత్వం వైపు వెళ్ళాడో అప్పటినుంచి సక్సెస్ లు అనేవి ఎక్కువగా రాలేదు.మొదటినుంచి కమల్ హాసన్ సినిమాలు చేసే శైలి పూర్తి భిన్నంగా ఉండేది. కమర్షియల్ సినిమాల పై దృష్టి పెట్టలేదు. ప్రయోగాత్మక సినెమాల పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. ఒకవేళ ఆయన అందరు హీరోల లాగా మాస్ సినిమాలపై దృష్టి పెడితే ఆయననుంచి మంచి మంచి హిట్ సినిమాలు వచ్చేవి.  పదుల కొద్ది వందల కోట్ల సినిమాలు వచ్చేవి కానీ ఆయన ప్రయోగాత్మక సినిమాలే చేయాలనీ కోరుకోవడం వల్ల అది సాధ్య పడలేదు.

విభిన్న పాత్రలు, విభిన్న గెటప్ లు వేసి విశ్వా నటుడు అనిపించుకున్న కమల్ హాసన్ అలాంటి సినిమాలే మొదటినుంచి చేయడం కోసం తాపత్రయ పడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా కమల్ హాసన్ ఈ యాక్షన్ సినిమాలో నటించడానికి కారణం సినిమా కథే. ఎంతో వైవిధ్యంగా ఈ సినిమా యొక్క కథ ఉంటుంది. అయితే దానికి యాక్షన్ కూడా మేళవించడం తో ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. కమల్ అభిమానులు అయితే చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ పెట్టె సినిమా కమల్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా వంద కోట్ల సినిమా గా మారడం ఖాయం అంటున్నారు. అలా కమల్ హాసన్ ఈ క్లబ్ లోకి తొలిసారి చేరి రికార్డు కొడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: