అనిరుధ్ ని ఆపడం కష్టమే..!!

P.Nishanth Kumar
తమిళనాట అగ్ర సంగీత దర్శకుడిగా వరుస క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు అనిరుధ్. తెలుగులో కూడా ఈ సంగీత దర్శకుడు సినిమాలు చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. రావడం రావడం తోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అలరించే పాటలను అందించిన ఈ సంగీత దర్శకుడు అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. అయితే తెలుగు లో సరైన ఎంట్రీ ఆయన దక్కలేదనే చెప్పాలి.  పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమా తో  ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చినా కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోకపోవడం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వలేక పోవడానికి కారణం.

ఇప్పుడు మరొక సారి ఆయన మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యం మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలు చేసినా కూడా పెద్ద హీరోతో చేయలేకపోతున్నాడు అనే విమర్శ ఉండనే ఉంది. తమిళనాట ఈ సంగీత దర్శకుడిని కాదని కూడా మరొక మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకోడానికి హీరోలు అందరూ ఆలోచిస్తారు.  అందరూ కూడా అనిరుధ్ కావాలని కోరుకునే వారే. ఈ నేపథ్యంలో తెలుగులో పెద్ద హీరోలు ఎందుకు ఈ సంగీత దర్శకుడితో పనిచేయడం లేదు అన్న నిరాశ అభిమానులలో ఎక్కువైంది. 

ఈ నేపథ్యంలోనే అందరినీ సంతోష పరుస్తూ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశాన్ని అందుకున్నాడు అనిరుధ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన మరిన్ని తెలుగు పెద్ద హీరోల సినిమాల అవకాశాలు అందుకోబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారట. ఈ విధంగా వరుస సినిమాలతో బిజీగా మారుతున్న అనిరుధ్ కూడా తొందరలోనే ఇక్కడ అగ్ర సంగీత దర్శకుడిగా ఎదగడం ఖాయమనీ చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: