మన సినిమా నే హాలీవుడ్ కాపీ కొట్టిందా..!!

P.Nishanth Kumar
కొన్ని సినిమాలను ప్రేరణగా తీసుకోవడం సహజమే. అలా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే మక్కీకి మక్కీ దించుతూ కేవలం ప్రేరణ అనే పేరుతో పలు మార్పులు చేసి సినిమాలు చేస్తున్నారు కొంతమంది. ఇటీవల కాలంలో స్ఫూర్తి అనే పేరుతో చాలా సినిమాలు చేసి విడుదల చేస్తున్నారు. ఎవరికి తెలియకుండా రీమేక్ రైట్స్ కొనుక్కొని బయటకు మాత్రం స్ఫూర్తి పొందానని చెప్తున్న ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ సినిమా నుంచి హాలీవుడ్ సినిమా పూర్తి పొందటం నిజంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతోందనీ చెప్పొచ్చు.

బాహుబలి సినిమా తో టాలీవుడ్ సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన రాజమౌళి ఇప్పుడు ఆయన గతంలో చేసిన సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సినిమా యొక్క గొప్పతనాన్ని తెలిసేలా చేస్తుంది. ఆయన ఆ మధ్య కాలంలో సృష్టించిన అద్భుత ప్రయోగం ఈగ సినిమా.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాను దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత హాలీవుడ్ లో చేయబోతుండటం విశేషం.

ఈగ సినిమా పోలికలతోనే ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ రాబోతూ ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా ఈ సినిమాకు ఈగ సినిమా పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. మ్యాన్ వర్సెస్ బీ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి ఈగ నుండి ప్రేరణ పొందిందని టైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మిస్టర్ బీన్ వంటి పెద్ద నటుడు ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటం నిజంగా విశేషం.ఈగ సినిమాలో విలన్ పై పగ తీర్చుకునేందుకు ఈగ రాగా ఈ సినిమాలో కథానాయకుడు ను తేనెటీగ ముప్పుతిప్పలు పెడుతోంది. మరి ఈ సిరీస్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: