ఊహించ‌ని ట్విస్ట్‌ : మహేష్ - తివిక్రమ్ మూవీలో ... మరొక హీరో ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ తో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కించారు. ముందుగా వీరిద్దరూ కలిసి చేసిన అతడు మూవీ మంచి సక్సెస్ పొందింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం మరొక్కసారి ఈ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. అనుష్క శెట్టి కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. 

ఇక ఖలేజా తరువాత దాదాపుగా పదేళ్ల విరామం అనంతరం త్వరలో మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి త్వరలో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయిన ఈ సినిమా అఫీషియల్ ప్రారంభోత్సవం ఇటీవల ఎంతో వైభవంగా జరిగింది. మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటించనున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, భారీ యక్షన్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో మరొక హీరో కూడా నటించనున్నారట. 

అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మూవీలోని ఒక కీలక రోల్ లో టాలీవుడ్ కి చెందిన మిడిల్ రేంజ్ హీరో ఒకరు నటించనున్నారని, ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన మహేష్, త్రివిక్రమ్ ద్వయం, త్వరలో ఆ హీరోతో పాటు ఇతర పాత్రధారులను కూడా ఎంపిక చేయనున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ మూవీని భారీ స్థాయిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా హారికా హాసిని సంస్థ నిర్మించనుండగా మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ మూవీ కథ ని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. ఇక ఈ మూవీని జులై లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: