ఆ స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్న సోనాలి బింద్రే..!

Divya
సోనాలి బింద్రే అందానికి అందం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది ఈ ముద్దుగుమ్మ. అయితే కొన్ని కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈమె బాలీవుడ్లో కూడా మంచి హీరోయిన్ గా పేరు పొందింది. ఒకవైపు మోడలింగ్ లోనూ తన హవా కొనసాగించింది అని చెప్పవచ్చు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా ఎంతో మంది అభిమానులను పోగు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మురారి చిత్రంతో పరిచయమైన ఈమె ఆ తరువాత మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం తదితర సినిమాలలో నటించి భారీ విజయాలను సొంతం చేసుకుంది.
మొదటి సినిమాతో ఎలాంటి గ్లామర్ తో ఆకట్టుకుందో ఆ తర్వాత బ్రేక్ ఇచ్చే వరకు అంతే గ్లామర్ తో ఆకట్టుకుంది సోనాలి బింద్రే.అలా తన లైఫ్ ఎంతో జాలిగా కొనసాగుతున్న సమయంలో క్యాన్సర్ బారిన పడడంతో ఆ సమయంలో ఆమె మానసికంగా కుంగి పోయింది అని తెలియజేసింది. అయితే ఆమె ఆలాంటి ప్రాణాపాయం నుంచి బయటపడటంతో ఆమె అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇమే పూర్తిగా కోలుకుంది అందువలన ఈమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఇలాంటి నేపథ్యంలోనే తెలుగులో నుంచి కూడా ఒక మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది
డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తెరకెక్కించబోతున్న సినిమాలో ఏమి నటించబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రేపు మాపు పూర్తి విషయాలు కూడా బయటకు వస్తాయి అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నపటికీ ఎవరిని ఫైనల్ చేస్తారని విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ మాదిరే సీనియర్ హీరోయిన్ లను ముఖ్యమైన పాత్రలో ఈమెకు కూడా అవకాశం వస్తుందేమో అనేది ఈ  చిత్రంలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: