వామ్మో : 'సర్కారు వారి పాట' కి అది అడ్డంకి గా మారనుందా ... ??
ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆ అంచనాలు మరింతగా పెంచడంతో మూవీ పై ప్రస్తుతం హైప్ తారా స్థాయికి చేరింది. మరోవైపు సినిమా తప్పకుండా హిట్ కొట్టి అందరి అంచనాలు అందుకుంటుందని హీరో మహేష్ సహా యూనిట్ మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాటకి థమన్ సంగీతం అందించారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ మరొక రెండు రోజుల్లో రిలీజ్ కానుండగా ప్రీ టికెట్స్ బుకింగ్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో అదరగొడుతున్నాయి. కానీ మరోవైపు ఆంధ్ర లోని పాలు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసాని తుఫాన్ ప్రభావం గట్టిగా ఉండేలా ఉందని, చాలా ప్రాంతాల్లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
దానితో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి వంటి ప్రాంతాల్లో ఈ తుఫాను మరింత భారీగా ఉండనుండడంతో అది సర్కారు వారి పాట కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని, అయితే మరికొన్ని గంటలు గడిచి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసాకనే పూర్తిగా మూవీ గురించి చెప్పగలం అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పూర్తిగా తుఫాను ప్రభావం సర్కారు వారి పాట పడే అవకాశం లేదని, ఒకవేళ ఎల్లుండి మరింత భారీగా వర్షాలు కురిస్తే ఆయా ప్రాంతాల్లో కొద్దిపాటి అడ్డంకి అయితే ఉండొచ్చని ఇంకొందరు అంటున్నారు. మొత్తంగా సరిగ్గా రిలీజ్ టైం లోనే తమ హీరో సినిమాకి ఈ అసాని తుఫాను అడ్డంకి గా మారిందని పలువురు మహేష్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తుఫాను ఎంతవరకు సర్కారు వారి పాట పై ప్రభావం చూపుతుందో చూడాలి.