ప్చ్ పాపం : పూజా పరిస్థితి ... ఇకనైనా మారుతుందా .... ??

GVK Writings
టాలీవుడ్ కి తొలిసారిగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే ఆ మూవీతో మంచి సక్సెస్ కొట్టారు. ఆపైన అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేసిన పూజా దానితో పెద్ద సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఇటు తెలుగులో సైతం అప్పట్లో కొన్నాళ్ల పాటు మంచి సక్సెస్ కోసం ఎదురు చూడసాగారు ఆమె. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అరవింద సమేత మూవీ మంచి సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా పూజా హెగ్డే కి పెద్ద బ్రేక్ ని అందించింది.
ఆ తరువాత మహేష్ తో మహర్షి, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో, వరుణ్ తేజ్ తో గడ్డలకొండ గణేష్ వంటి సినిమాలతో భారీ సక్సెస్ లు కొట్టిన పూజా, ఆపైన అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో మరొక విజయం అందుకున్నారు. అయితే అనంతరం వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్, అలానే ఇటీవల వచ్చిన విజయ్ బీస్ట్ మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలయి పూజా కెరీర్ ని కొంత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇక చిరంజీవి, చరణ్ కాంబోలో మొన్న వచ్చిన ఆచార్య లో కూడా హీరోయిన్ గా నటించిన పూజా ఆ మూవీతో కూడా మరొక భారీ డిజాస్టర్ ని చవిచూడకతప్పలేదు. దానితో గోల్డెన్ లెగ్ గా పేరు సాధించిన పూజా ఒక్కసారిగా నెగటివ్ గా మారారని కొందరు పుకార్లు మొదలెట్టారు.
అయితే ప్రస్తుతం పూజా కెరీర్ కొంత నెగటివ్ గా సాగుతున్న విషయం వాస్తవమేనని, అయితే రాబోయే ఆమె తదుపరి ప్రాజక్ట్స్ తో మళ్ళి ఆమె మంచి సక్సెస్ ట్రాక్ లోకి రావడం ఖాయం అని ఆమె ఫ్యాన్స్ పలువురు అభిప్రాయపడుతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి మన చేతుల్లో ఉండవని, తనని ఇప్పటివరకు ఆదరించిన ప్రేక్షకాభిమానులకి ఇటీవల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన పూజా, తప్పకుండా రాబోయే సినిమాలతో తనని మరింతగా ఆదరిస్తారని నమ్మకం వెలిబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: