రాబోయే పాన్ ఇండియా లు కూడా సత్తా చాటేనా!!

P.Nishanth Kumar
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదలయ్యి దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నాయి. పుష్ప సినిమా ఈ సారి పాన్ ఇండియా సినిమాల విడుదలను మొదలు పెడితే వరుసగా చాలా సినిమాలు ఇప్పటి వరకు విడుదల అవుతూ వచ్చాయి. 83, గంగుబాయి, రాధే శ్యామ్,  ఆర్.ఆర్.అర్, కేజీఎఫ్ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా మరికొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకొని కోట్ల కొద్దీ వసూళ్లను సాధిస్తుంది.

హిందీలో ఆర్ ఆర్ ఆర్ సినిమా 250 కోట్ల మార్కు కు చేరువలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.  మొదటిరోజు హిందీలో 54 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండవ రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసుకుని రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఆ విధంగా సౌత్ సినిమాకు ఇటువంటి ఆదరణ రాగా ఆ చిత్రానికి రాబోయే రోజులలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పుడు మరికొన్ని సినిమాలు భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను తెలుగు లోనే కాకుండా హిందీలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్ లేకుండా విడుదల చేస్తే ఏ విధంగా ఉంటుందో అన్న ఆలోచన కూడా వారు చేస్తున్నారు. ఇక అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ మే 27వ తేదీన విడుదల కాబోతుంది. నాగచైతన్య అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ చద్ద సింగ్ కూడా ఆగస్టు 12న రాబోతుంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా రాబోతుంది. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ విధంగా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. నేపథ్యంలో వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లను సాధిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: