టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొత్తగా వచ్చే హీరోలు సైతం పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తూ ఉంటే తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు దక్షిణాదిన మంచి క్రేజ్ ఉన్న హీరోలైన అక్కినేని హీరోలు ఈ సినిమాలు చేసే విషయంలో ఆమడ దూరంలో ఉండడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు లో అందరూ కూడా పాన్ ఇండియా సినిమా చేయడం మొదలు పెట్టారు. అయితే అక్కినేని అభిమానులు కోరుకున్నట్లుగా అక్కినేని హీరోలు ఇప్పటివరకు సినిమాలు చేయలేదు.
కారణం ఏదైనా కూడా ఈ తరహా సినిమాలు చేసి అందరిని అలరించాలని వారు భావిస్తున్నారు. ఇంత వరకు వంద కోట్ల వసూళ్ల మార్క్ ను కూడా అందుకోలేకపోయినా ఈ హీరోలు ఈ సినిమాలు ఎలా చేస్తారు అనే విమర్శ ఒకవైపు ఉన్నా కూడా వారికి ఆ సత్తా ఉందని ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారని వాదన వినిపిస్తుంది. ఇక వారు ఇప్పుడు చేస్తున్న సినిమాలను చూడబోతే పాన్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకునేందుకు వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇప్పటికే నాగార్జున బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగచైతన్య కూడా బాలీవుడ్లో తెరకెక్కిన లాల్ చద్ధా సింగ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల ద్వారా వీరిద్దరికీ బాలీవుడ్ లో సైతం మంచి మార్కెట్ రావడం ఖాయం అంటున్నారు. ఇటు అఖిల్ కూడా బాలీవుడ్ లో తను నటిస్తున్న ఏజెంట్ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఆ విధంగా ఈ ముగ్గురు హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమాలు విడుదలైతే కానీ వారికి ఏ స్థాయిలో అక్కడ క్రేజ్ ఏర్పడుతుందో చెప్పలేము. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కింగ్ నాగార్జున ఈ స్థాయిలో నటించడం ఇదే తొలిసారి కాబట్టి అక్కడ తప్పకుండా ఆయనకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. నాగచైతన్య కూడా అమీర్ ఖాన్ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్నాడు. మరి వీరి సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధం గా ఉన్న నేపథ్యంలో వారు ఏ రకమైన మార్కెట్ ను సంపాదించుకుంటారో చూడాలి.