మెగా మేనల్లుళ్ళ కోసం పవన్ సలహాలతో మారిన త్రివిక్రమ్ వ్యూహాలు !

Seetha Sailaja
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ లది విడదీయరాని అనుబంధం. వారు చేసిన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వారిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది. సాధారణంగా పవన్ ఎవరితోనూ సన్నిహితంగా ఉండడు. అలాంటిది త్రివిక్రమ్ పవన్ లు కలిసారు అంటే గంటలు తరబడి సాహిత్యం వర్థమాన రాజకీయాలు సైన్స్ విషయాల పై ఎంతో మాట్లాడుకుంటూ ఉంటారట.


పవన్ త్రివిక్రమ్ లు కలిసి మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు అన్న విషయం క్లారిటీ లేకపోయినా పవన్ నటించే సినిమాలకు స్క్రిప్ట్ అందించే బాధ్యత మాత్రం త్రివిక్రమ్ కు రోజురోజు పెరిగిపోతోంది. ‘భీమ్లా నాయక్’ ఘన విజయంలో ఆసినిమాలోని పవన్ పాత్రను అత్యంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ చూపించిన ప్రతిభ కారణంగానే ఆమూవీ స్థాయిలో అందరికీ నచ్చింది అని కూడ అంటారు.


ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో చేయబోతున్న మూవీకి సంబంధించిన పనులు చూసుకుని మళ్ళీ పవన్ నటించబోతున్న మరో రెండు సినిమాలకు తన మాటల మాయాజాలం దానం చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ దేవుడుగా నటిస్తున్న సముద్రఖని తమిళ మూవీ ‘వినోదాయి సీతం’ మూవీ స్క్రిప్ట్ పనులు చాల వేగంగా త్రివిక్రమ్ ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు చూస్తూనే త్రివిక్రమ్ పవన్ నటించే మరొక సినిమాకు కూడ స్క్రిప్ట్ పనులు చూస్తున్నట్లు టాక్.  


సముద్రఖని దర్శకత్వంలో తీయబోయే మూవీలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తూ ఉంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్ అమ్దిమ్చబోయే మరొక సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇలా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో తన సాన్నిహిత్యం కొనసాగిస్తూనే మెగా మేనల్లుళ్ళ బాధ్యతను కూడ పవన్ సలహాతో తీసుకోవడంతో ఈ మెగా మేనల్లుళ్ళ ఇద్దరికీ గోల్డెన్ పిరియడ్ స్టార్ట్ అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మాటల మాంత్రికుడు తలుచుకుంటే ఎవర్ని అయినా స్టార్ చేయగలడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: