క్రికెట్ లో ఇలాంటి రూల్సు పెడితే.. ఇక అంతే సంగతులు?
అయితే ఇటీవలే జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం క్రికెట్ లో కొత్త రూల్స్ చెప్పి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంది జబర్దస్త్ కార్యక్రమం. అయితే ఈ జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్మెంట్ డబుల్ చేసేందుకు ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది అనే విషయం తెలిసిందే. ప్రతి వారం గురు శుక్రవారాల్లో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నాయ్.ఇక ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది
ప్రోమో కాస్త ప్రస్తుతం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ ప్రోమో లో భాగంగా సుడిగాలి సుధీర్ స్కిట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది.ఎప్పటిలాగానే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏకంగా జబర్దస్త్ స్టేజ్ పైన క్రికెట్ ఆడి అలరించారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇక స్కిట్ లో భాగంగా కొన్ని క్రికెట్ రూల్స్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయ్. సుడిగాలి సుదీర్ బ్యాటింగ్ చేస్తూ ఒక సిక్సర్ కొడతాడు. అయితే సిక్సర్ కి అంపైర్ పది పరుగులు ఇస్తాడు. అదేంటి సిక్సర్ కి 6 పరుగులే కదా అంటూ అడగగా.. బౌండరీ దాటితే నాలుగు పరుగులు ఇక బౌండరీ పైనుండి పడితే ఆరు పరుగులు ఏకమొత్తంగా 10 పరుగులు ఇస్తున్నాము అంటూ అంపైర్ గా ఉన్న గెటప్ శ్రీను చెబుతాడు. తర్వాత సుధీర్ బౌలింగ్లో ఆటో రాంప్రసాద్ అవుట్ అవుతాడు. ఇక అవుట్ అయిన తర్వాత మరో వైపు వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. ఏంటండీ అతను అవుట్ అయ్యాడు కదా అని అడిగితే అటువైపు అవుటయ్యాడు కాబట్టి ఇటువైపు బ్యాటింగ్ చేసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పడంతో అందరూ పడి పడి నవ్వుతారు. ఇక ఇది చూసిన తర్వాత క్రికెట్ లో ఇలాంటి రూల్సు ఉంటే ఇక అంతేసంగతులు అంటూ కామెంట్ చేస్తున్నారు కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు.