నాని ఇప్పుడే అలా చేయాలా..!!
ఒక క్లాతింగ్ బ్రాండ్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యారు. దానికి సంబంధించిన యాడ్ కూడా టీవీలలో ప్రసారం అవుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలు చేసే యాడ్ నాని చేయడం పట్ల కొంత మంది ఎంతో అయిష్టంగా ఉన్నారు. ముఖ్యంగా నాని హార్డ్ కోర్ అభిమానులు మాత్రం నాని అప్పుడే ముసలోడు అయిపోయాడా ఎందుకు ఇలాంటి యాడ్స్ చేస్తున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ యంగ్ హీరో ఇలా సీనియర్ హీరోలు చేసే యాడ్స్ చేయడం మంచిది కాదని వారు చెబుతున్నారు.
ఇక నాని చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దసరా అనే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం చేస్తున్నాడు ఈ హీరో. అంతేకాదు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాను కూడా ఆయన ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు కూడా భిన్నమైన సినిమాలు కావడంతో తొందరలో ప్రేక్షకులను అలరించి మరొక మెట్టు ఎక్కడానికి నాని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాల ద్వారా నాని కి ఏ స్థాయిలో విజయం దక్కుతుందో చూడాలి.