తమిళనాడులో కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ పరంపర.. కళ్ళు చెదిరే ప్రాఫిట్..!!
ఇక ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించింది అని ఇప్పటికీ తాము కోరుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలోనే షేర్ రాబట్టింది అని. తాజాగా TN థియేటర్ యజమానుల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం తాజాగా వెల్లడించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ శుక్రవారం పెద్ద సినిమాలు విడుదల అయ్యే ఆస్కారాలు లేవు కాబట్టి ఈ నెల 13వ తేదీన విడుదలయ్యే బీస్ట్ సినిమా వచ్చే వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా పరంపర కొనసాగుతుంది అని తెలిపాడు.
బీస్ట్ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఏ మాత్రం సందేహం లేకుండా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి పోతుంది అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేయడంతోపాటు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది.