రామ్ చరణ్ కొత్త లుక్ ..వైరల్ అవుతున్న ఫోటోలు..
ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో రామ్ చరణ్ ఎప్పుడు కనిపించని విధంగా పంచె కట్టులో కనిపించాడు. అంతే కాదు అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టుకుని సైకిల్‌పై కనిపించాడు. ఈ తాజా లుక్ చూసి చరణ్ ఇలా మారిపోయాడేంటి అని అంతా షాక్ అవుతూన్నారు. అంతేకాదు వీటి పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు కూడా పెడుతున్నారు.. చరణ్ నటిస్తున్న శంకర్ సినిమా లోని కొన్ని ఫోటోలు లీకై నట్లు తెలుస్తుంది.
చరణ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని మొదటి నుంచి చెబుతున్నారు.. చరణ్ నాలుగు విభిన్న పాత్రలలో నటిస్తారని ఇటీవల శంకర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..శంకర్ సినిమా అంటే అందులో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తప్పసరిగా ఉండాల్సిందే. ఆయన దర్శకత్వంలో రూపొంది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన భారతీయుడు, జెంటిల్‌మెన్, అపరిచితుడు వంటి చిత్రాల్లో కూడా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఉన్నాయి. ఆ సినిమాకు అవి హిట్ టాక్ ను అందించాయి. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా 1930 సమయంలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉందని సమాచారం..దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారు.