నితిన్ సరికొత్త ప్రయోగం.. ఆ సినిమాలా ఉందే..!!

P.Nishanth Kumar
నితిన్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకుల ను ఎంతగా నో అలరిస్తున్న నితిన్ పోయిన ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చెక్ మరియు రంగ్ దే వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించగా రెండో అర్థ భాగం లో మ్యాస్త్రో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఆ విధంగా పోయిన ఏడాది ఆయన మంచి సక్సెస్ ను అందుకోలేదని చెప్పాలి. ఇప్పుడు ఆయ న హీరోగా తెరకెక్కుతున్న సినిమాలతో తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను ఎంచుకోవడంతోనే తా ను ఏ తరహాలో సినిమాలు చేయాలి అనుకున్నాడో చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల కాగా దానిలో నితిన్ ఫో జ్ చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత కూడా నితిన్ తదుపరి చేయబోయే సినిమాల సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటికే వక్కంతం వంశీ దర్శకత్వం లో ఆయన చేయబోయే సినిమా దాదాపుగా ఫైనల్ అయింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. అంతే కాకుండా ఓ నూతన దర్శకుడితో కలిసి ఆయన సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇటీవ ల వచ్చాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేసే విధంగా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలతో ఏ విధంగా ఆయన సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: