మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ రోజు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. చిరంజీవి తనయుడుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక మైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత ఈ సినిమా థియేటర్లలో సందడి చేయగా ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమాకు రామ్ చరణ్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా వారి అభిమానుల కలను నిజం చేసింది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు నటించాలనే ప్రేక్షకుల కోరిక కూడా ఈ సినిమాతో తీరింది. ఫలితం ఏవిధంగా అయితే రావాలని ఆశించారో అంతకుమించిన ఫలితాన్ని సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పవచ్చు.
దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా ఈ సినిమా మంచి జోరు ను కొనసాగిస్తూ బాలీవుడ్ ను షేక్ అని చెప్పవచ్చు. ఎంతోమంది బాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తొలిసారి ఈ ఏడాది ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీసుకు వస్తున్నాడని చెప్పాలి. చిరు హీరోగా నటించిన ఆచార్య సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతున్నగా ఈ చిత్రంలో ఆయన మరొకసారి ప్రేక్షకులను అలరించే విధమైన పాత్ర చేశాడని అంటున్నారు. ఆ విధంగా ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ 2022 వెరీవెరీ స్పెషల్ గా నిలిచేలా చేసుకున్నాడు ఇక ఆయన తదుపరి సినిమాలు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించే విధంగా ఉన్నాయి.