'ఆర్ ఆర్ ఆర్' పై మహేష్ బాబు ప్రశంసలు..!

Anilkumar
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇకపోతే మెగా నందమూరి అభిమానులు థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. అయితే అభిమానులతో పాటు సినిమాను చూడడానికి సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సుకుమార్ ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రివ్యూ ఇచ్చారు.ఇక చాలా మంది మహేష్ బాబు రివ్యూ కోసం చూశారు. ఎందుకు అంతలా అందరు చూసారు అంటే మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేయనున్నారు కాబట్టి.అయితే కచ్చితంగా మహేష్ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం మాట్లాడతారని అభిమానులు భావించారు.ఐకపోతే దానికి తగ్గట్లే ఈరోజు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సినిమాను తెగ పొగిడేశారు. అయితే ఇందులో భాగంగా మహేష్ బాబు 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక ఎపిక్ అని.. 

ఇక సినిమా స్కేల్, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటీ ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. అయితే ఎన్టీఆర్, చరణ్ తమ స్టార్ డమ్ కి మించి వరల్డ్ క్లాస్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని పొగిడేశారు. దీనితోపాటు 'నాటు నాటు' సాంగ్ లో లా ఆఫ్ గ్రావిటీ అసలు కనిపించలేదని.. వారు ఎగురుతూ డాన్స్ చేశారని పేర్కొన్నారు. అయితే ఇలాంటి సినిమాను రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి హ్యాట్సాఫ్ చెబుతూ.. ఎంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రిబుల్ ఆర్ సినిమా పై చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అన్నట్టు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: