వీరు.. ఉరికే స్టార్ డైరెక్టర్ లు అయిపోలేదు..!!

P.Nishanth Kumar
ఒకప్పుడు సినిమా పరిశ్రమ లో సక్సెస్ అవడం అనేది అంత తేలికగా జరిగేది పని కాదు. డైరెక్షన్ చేయాలనుకునేవారు దాదాపు చాలా అనుభవం సంపాదించుకోవాలి. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి స్టార్ హీరోల దృష్టిలో పడాలి. నిర్మాతలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని ఒక కథ చెప్పి వారితో ఓకే అనిపించుకున్న తరువాత వారికి దర్శకుడిగా అవకాశం వస్తుంది. అప్పట్లో సినిమాల పట్ల ఉత్సాహం తో చదువుపై దృష్టి పెట్టకుండా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు.

చదువు మానేసి సినిమాల్లో రాణించాలని వచ్చేవారు సంవత్సరాలు తరబడి సినిమాలకు పనిచేసేవారు ఎప్పుడో కానీ అవకాశం ఎఆడు. అయితే తరాలు మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతున్న కొద్దీ సినిమా పరిశ్రమలో కూడా చదువు కంపల్సరీ అనే విధంగా పరిస్థితులు మారాయి. దర్శకుల వద్ద సంవత్సరాలకు సంవత్సరాలు పని చేస్తూ వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చునే పరిస్థితి ఇప్పుడు లేదు. డైరెక్షన్ చేయాలనుకునేవారు టెక్నాలజీపై అవగాహన పెంచుకుని ఈజీగా దర్శకులుగా మారబోతున్నారు.

 చదివిన చదువు ద్వారా సంపాదించిన జ్ఞానం తో వారు దర్శకులుగా ఎలాంటి అనుభవం లేకుండా కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు మంచి ఎడ్యుకేషన్ ఉన్నవారే. త్రివిక్రమ్ సుకుమార్, దేవకట్ట, కొరటాల శివ, శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, రవి బాబు వంటి దర్శకులు అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ తో వచ్చి సినిమా పరిశ్రమలో కొత్త అనుభవాన్ని గడించిన దర్శకులు తమ కెరీర్ ని మొదలు పెట్టి ఇప్పుడు అగ్ర దర్శకులుగా మారారు. నిజంగా చదువు కున్న డైరెక్టర్స్ ఉంటే ఇండస్ట్రీ కి ఎంతో మంచిది. ఏదేమైనా ఇండస్ట్రీ అంటే చదువు రాణి వారు మాత్రమే ఉంటారు అని పేరు ఇన్ని రోజులనుంచి ఉంది. ఇప్పుడు ఆ మచ్చ పోతుంది అని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: